తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ ఉల్లంఘనల సమాచారం వెల్లడించం'

ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోదీతో సహా మరికొందరు నేతలపై వచ్చిన నియమావళి ఉల్లంఘన వివరాలను తెలిపేందుకు ఈసీ నిరాకరించింది. ఓ వ్యక్తి దాఖలు చేసిన సమాచార హక్కు వ్యాజ్యానికి స్పందించింది ఈసీ. లోక్​సభ ఎన్నికల వేళ పలువురు నేతలపై ఆరోపణలు వచ్చినా చాలా మందికి సచ్ఛీలత పత్రాన్ని ఇచ్చింది ఈసీ.

నరేంద్రమోదీ

By

Published : Jun 10, 2019, 3:35 PM IST

సార్వత్రిక సమరంలో నేతల ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై సమాచారం తెలిపేందుకు నిరాకరించింది ఎలక్షన్​ కమిషన్. ఆర్టీఐ ద్వారా చేసిన దరఖాస్తుకు సమాధానంగా.. ప్రాదేశికంగా జరిగే అంశాలకు సంబంధించి సమగ్రమైన సమాచారం తమ వద్ద లేదని తెలిపింది.

"ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు ప్రాదేశికం. మీరు కోరుతున్న సమాచారం సమగ్ర రూపంలో లేదు. అందుకే ఆర్టీఐ చట్టంలోని సెక్షన్​-7(9)ను ఉపయోగించి మీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం."

- ఎన్నికల సంఘం

ఈ సెక్షన్​ ప్రకారం ప్రభుత్వ అధికార వనరులకు భంగం కలిగే అవకాశం ఉన్నా, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచాల్సి ఉన్నా కోరిన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఎన్నికల ఉల్లంఘన విషయంలో ప్రధాని నరేంద్రమోదీకి క్లీన్​చిట్​ ఇచ్చిన అంశానికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఓ పాత్రికేయుడు కోరారు. అంతేకాకుండా సార్వత్రికంలో నమోదైన ఉల్లంఘనలు, వాటికి సంబంధించిన సమావేశాలు, తుది నిర్ణయాలను ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరారు.

ప్రచార సభల్లో మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చాలా ఆరోపణలు చేసింది. వాటన్నింటిల్లోనూ ప్రధానికి సచ్ఛీలత పత్రాన్ని ఇచ్చింది ఈసీ. వార్దా సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై చేసిన వ్యాఖ్యలతో పాటు లాతూర్​లో బాలాకోట్​, పుల్వామాను వాడుకుని ఓట్లు అడిగారని ఈసీకి ఫిర్యాదు చేసింది హస్తం పార్టీ.

ఇదీ చూడండి: మమతది కిమ్​జోంగ్​ వ్యక్తిత్వం: గిరిరాజ్​

ABOUT THE AUTHOR

...view details