అన్నాడీఎంకే మాజీ నేత టీటీవీ దినకరన్‌కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. రెండాకుల గుర్తుపై ట్రయల్ కోర్టు విచారణను నిలిపేయాలని దిల్లీ హైకోర్టు స్టే విధించింది. అన్నాడీఎంకే పార్టీ గుర్తును దక్కించుకునేందుకుఎన్నికల సంఘం అధికారులకు భారీగా లంచం ఇవ్వజూపారని దినకరన్‌పై అభియోగాలున్నాయి.
ఈ వ్యవహారంలో దినకరన్‌పై కేసులు పెట్టాలని పలువురు అన్నాడీఎంకే నేతలు కోర్టును ఆశ్రయించారు. ఐపీసీ సెక్షన్120బీ (మోసపూరిత కుట్ర), 201 (సాక్ష్యాలను ధ్వంసం చేయడం)తోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 కింద ట్రయల్ కోర్టు కేసు నమోదు చేసింది.