తెలంగాణ

telangana

'చౌకీదార్​' చిత్రాలపై వివరణ ఇవ్వండి : ఈసీ

By

Published : Apr 3, 2019, 6:26 AM IST

రైల్వేశాఖకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మే బీ చౌకీదార్ నినాదాన్ని రైల్వే టికెట్లు, టీ కప్పులపై ముద్రించడాన్ని తప్పుపట్టింది. ఈ విషయమై గురువారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

గురువారం లోగా వివరణ ఇవ్వాలి: ఈసీ

'మే బీ చౌకీదార్' ప్రచారానికి సంబంధించిన చిత్రాలనురైల్వేశాఖ టికెట్లు, టీ కప్పులపై ముద్రించడాన్ని తప్పుపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇది ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందికి వస్తుందా... లేదా అనే అంశమై రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. గురువారంలోగా ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. శతాబ్ది ఎక్స్​ప్రెస్​కు చెందిన టికెట్లను ఓ ప్రయాణికుడు ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు. వాటిపై మై బీచౌకీదార్​ నినాదం ఉండటం వివాదానికి కారణమైంది.

వివాదాస్పద కప్పులను వెనక్కి పంపిస్తామని, గుత్తేదారు​పై చర్య తీసుకుంటామని రైల్వేశాఖ ప్రకటించింది. రైల్వే టికెట్లపై మోదీ చిత్రాలను ముద్రించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది.

"సంకల్ప్ అనే ఎన్​జీఓ సంస్థ రైల్వేకు సంబంధించిన టీ కప్పులను తయారు చేస్తోంది. ఈ కప్పులపై భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన నినాదాలు ఉన్నాయి. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకి వస్తుంది."-ఎన్నికల సంఘం

సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ఎన్నికల సంఘం. ఈ విషయమై రైల్వేశాఖ ఇంకా స్పందించలేదు.

ABOUT THE AUTHOR

...view details