తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శాంతి మంత్రానికే భారత్​- చైనా మొగ్గు: ఎంఈఏ - భారత విదేశాంగ శాఖ

సరిహద్దు సమస్యలను ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్​, చైనా ఓ అంగీకారానికి వచ్చాయని భారత విదేశాంగశాఖ తెలిపింది. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో నెలరోజులుగా నెలకొన్న ఉద్రిక్తతల తగ్గింపే లక్ష్యంగా భారత్-చైనా సైనికాధికారులు జరిపిన సమావేశం స్నేహపూర్వకంగా సాగిందని స్పష్టం చేసింది.

Eastern Ladakh standoff: Indian, Chinese armies agree to resolve issue through talks
శాంతియుత పరిష్కారానికే మొగ్గు

By

Published : Jun 7, 2020, 11:45 AM IST

భారత్​- చైనాలు సరిహద్దు సమస్యలను ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు శాంతియుతంగా పరిష్కరించుకునేందుకుగాను ఓ అంగీకారానికి వచ్చాయని భారత విదేశాంగశాఖ తెలిపింది. భారత్​-చైనా మధ్య సైనిక చర్యలు స్నేహపూర్వక, శాంతియుత వాతావరణంలో జరిగాయని వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, సరిహద్దుల వెంట శాంతి నెలకొనడం అవసరమని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

తూర్పు లద్దాఖ్ సరిహద్దులో నెలరోజులుగా నెలకొన్న ఉద్రిక్తతల తగ్గింపే లక్ష్యంగా భారత్-చైనా సైనికాధికారులు శనివారం సమావేశమయ్యారు. వాస్తవాధీన రేఖ వెంబడి.. చైనాకు చెందిన చుషుల్ సెక్టార్​లోని మాల్డోలో ఈ సమావేశం జరిగింది. భారత్‌ తరఫున లేహ్‌లోని 14 కార్ప్స్‌ విభాగానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ హరిందర్ సింగ్, చైనా తరఫున టిబెట్‌ సైనిక జిల్లా కమాండర్‌ లూ లెన్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు లెఫ్టినెంట్ల స్థాయిలో చర్చలు జరగటం ఇదే మొదటిసారి.

దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు

"ఈ ఏడాదితో భారత్​ చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు అయ్యాయి. ఇరుదేశాల మధ్య ఇప్పటి వరకు కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను పరస్పరం గౌరవిస్తూనే... ఇరుదేశాల బంధం మరింత అభివృద్ధి చెందాలని భారత్​, చైనా ఆకాంక్షిస్తున్నాయి."

- భారత విదేశాంగశాఖ

సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడం కోసం ఇరుపక్షాలు సైనిక, దౌత్యపరమైన చర్యలు కొనసాగిస్తాయని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:కిక్కిరిసిన అమెరికా రోడ్లు- శాంతియుతంగా నిరసనలు​

ABOUT THE AUTHOR

...view details