తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైనిక జనరల్​ల స్థాయిలో భారత్-చైనా సమావేశం - Chinese Army

లద్దాక్​​లో గత నెలరోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే విధంగా అడుగులు వేశాయి భారత్, చైనా సైనికవర్గాలు. చైనా వైపు చుశూల్ ప్రాంతంలోని మాల్డో వద్ద లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో ఇరుదేశాల ప్రతినిధుల మధ్య సమావేశం జరిగింది. భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్.. చైనా ప్రతినిధిగా టిబెట్ సైనిక విభాగం బాధ్యుడు ఈ సమావేశానికి హాజరయ్యారు.

sino-india
సైనిక జనరల్​ల స్థాయిలో భారత్-చైనా సమావేశం

By

Published : Jun 6, 2020, 4:12 PM IST

Updated : Jun 6, 2020, 5:15 PM IST

సరిహద్దు వివాదంపై భారత్, చైనా జనరల్‌ స్థాయి అధికారుల మధ్య.. తూర్పు లద్దాఖ్‌ చుశూల్ ప్రాంతంలోని మాల్డో వద్ద సమావేశం జరిగింది. భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా ప్రతినిధిగా టిబెట్ మిలిటరీ కమాండర్ హాజరయ్యారు. నెలరోజులుగా భారత్​-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఈ సమావేశంలో ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సద్దుమణిచే లక్ష్యంతో దౌత్య అధికారులు, సైన్యం సంప్రదింపులతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. స్థానిక కమాండర్ల స్థాయిలో 12 రౌండ్లు, మేజర్ జనరల్ స్థాయిలో మూడు రౌండ్ల సమావేశాలు పూర్తయిన అనంతరం ఈ సమావేశం నిర్వహణకు ఇరు దేశాలు మొగ్గు చూపాయి.

ఇదీ నేపథ్యం..

మే 5, 6 తేదీల్లో భారత్​-చైనాసరిహద్దుల వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. లద్దాక్​లోని పాంగాంగ్ సో, గాల్వన్ లోయ, దెమ్‌చోక్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశం వేదికగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు నిర్దిష్ట ప్రతిపాదనలు చేయనుంది భారత్. పాంగాంగ్ సో, గాల్వన్ లోయ నుంచి చైనా బలాలు వెనుదిరగాలని వాదన వినిపిస్తోంది. చైనా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ శిబిరాలను తొలగించాలని డిమాండ్ చేస్తోంది.

ఇదీ చూడండి:గజరాజుతో చిన్నారి స్నేహం.. నెట్టింట వైరల్​

Last Updated : Jun 6, 2020, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details