భారత్, చైనా మధ్య 8వ దఫా కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చలు ఈ వారం జరిగే అవకాశం ఉంది. శీతకాలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్న అంశంపై చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, భేటీకి సంబంధించి స్పష్టమైన తేదీ ఇంకా ఖరారు కాలేదు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ బాధ్యత చైనాపైనే ఉందని భారత్ మొదటి నుంచి వాదిస్తోంది. అక్టోబర్ 12న జరిగిన ఏడో దఫా చర్చల్లో ఉపసంహరణ ప్రక్రియకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నా.. అందులో ఎలాంటి పురోగతి లేదు. కానీ, చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని ఇరు వర్గాలు ప్రకటించాయి.
ఆరో దఫా చర్చల్లో కీలక నిర్ణయాలు..