దేశవ్యాప్తంగా ఈస్టర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏసు ప్రభువు పునరుత్థాన దినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదర సోదరీమణులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేరళలో అర్ధరాత్రి నుంచే ఈస్టర్ పర్వదినం సంబరాలు మొదలయ్యాయి. కాథెడ్రల్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
దేశమంతా ఈస్టర్.. క్రైస్తవుల ఆనందోత్సాహాలు - mumbai
దేశవ్యాప్తంగా ఏసుక్రీస్తు పునరుత్థానదినం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముంబై, చెన్నై, పుదుచ్ఛేరి, తిరువునంతపురం సహా అన్ని ప్రధాన నగరాల్లోని చర్చిలు ఈస్టర్ వేడుకలతో శోభిల్లుతున్నాయి.
దేశమంతా ఈస్టర్ శోభ... ఆనందోత్సాహాలలో క్రైస్తవులు
ముంబై, చెన్నై, పుదుచ్ఛేరి సహా అన్ని ప్రధాన నగరాల్లోని చర్చిలు ఈస్టర్ శోభతో కళకళలాడుతున్నాయి. క్రైస్తవ మతపెద్దలు మానవాళి పట్ల క్రీస్తు చూపించిన ప్రేమ, త్యాగం, కరుణ వంటి అంశాల గురించి వివరిస్తున్నారు. క్రీస్తు ఆరాధన గీతాలు, సందేశాలను చిన్నా పెద్దా అందరూ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నారు.
Last Updated : Apr 21, 2019, 9:44 AM IST