భూకంపం కారణంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఒక మహిళ మృతిచెందింది. మరో 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని పీఓకేలో మీర్‌పుర్‌లోని ఆస్పత్రికి తరలించారు.
పాకిస్థాన్‌లో భూకంపం- ఒకరు మృతి, 50 మందికి గాయాలు - 173 km North West of Lahore, Pakistan.
18:13 September 24
18:04 September 24
50 మందికి గాయాలు
పాకిస్థాన్‌లో భూకంపం కారణంగా 50 మంది గాయపడ్డారు. వీరిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు.
పంజాబ్ రాష్ట్రం ఝేలమ్లోని పర్వత ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు పాకిస్థాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. 5.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించింది.
17:11 September 24
భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఫలితంగా దిల్లీ, పంజాబ్, హరియాణాలో భూమి కంపించింది. ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని రావల్పిండికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు దిల్లీలోని జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం-ఎన్సీఎస్ అధికారులు తెలిపారు. తీవ్రత 6.3గా ఉండొచ్చని అంచనా వేశారు.
పాకిస్థాన్‌లో....
ఉత్తర పాకిస్థాన్‌లోని అనేక నగరాలను భూకంపం కుదిపేసింది. ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, లాహోర్‌లో 5.7 తీవ్రతతో 8-10సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది.
17:05 September 24
పాకిస్థాన్‌లో భూకంపం- ఉత్తర భారతంలో కలకలం
ఉత్తర పాకిస్థాన్‌లోని అనేక నగరాలను భూకంపం కుదిపేసింది. ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, లాహోర్‌లో 5.7 తీవ్రతతో 8-10సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది.
ఉత్తర భారతంలో...
దిల్లీ, పంజాబ్, హరియాణాలోనూ సాయంత్రం 4.33 సమయంలో భూమి కంపించింది. ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
16:47 September 24
దిల్లీలో భూకంపం- భయంతో జనం పరుగులు
దిల్లీలో భూమి కంపించింది. ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు.
పాకిస్థాన్ లాహోర్‌కు వాయువ్య దిశలో 173 కిలోమీటర్ల దూరాన 6.1 తీవ్రతతో భూకంపం రావడమే దిల్లీలో ప్రకంపనలకు కారణంగా తెలుస్తోంది.