దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భూప్రకంపనలు సంభవించాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గురువారం ఉదయం 7:40 గంటలకు భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.5గా నమెదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది.
ఈశాన్య రాష్టం అసోంలో ఉదయం 7:57 గంటలకు భూమి స్వల్పంగా కపించించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.1గా నమోదైంది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనాలో ఉదయం 4:47 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 2.3గా ఉంది.
ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.