తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మణిపుర్​ ఉఖ్రుల్​​లో భూకంపం.. 4.3 తీవ్రత నమోదు - మణిపుర్​లో భూకంపం

మణిపుర్​లోని ఉఖ్రుల్​ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 4.3 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్​సీఎస్​) తెలిపింది.

Earthquake
మణిపుర్​ ఉఖ్రుల్​​లో భూకంపం

By

Published : Oct 7, 2020, 8:31 AM IST

దేశంలో కొద్ది రోజులుగా భూప్రకంపనలు పెరిగాయి. తాజాగా మణిపుర్​లోని ఉఖ్రుల్​ జిల్లాల్లో భూమి కంపించింది. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో రెండుసార్లు భూకంపం రావడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది.

భూకంప లేఖినిపై 4.3 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్​సీఎస్​) వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున 3.32 గంటల ప్రాంతంలో భూమి కంపించగా.. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఈ ఘటన వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.

ఇటీవల సెప్టెంబర్​ 1న ఉఖ్రుల్​కు తూర్పున 55 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్​ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది.

ఇదీ చూడండి: లేహ్​లో భూకంపం.. 5.1 తీవ్రత నమోదు

ABOUT THE AUTHOR

...view details