ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఈ తెల్లవారుజామున 4 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై 5.3 తీవ్రత నమోదైంది. భారత్- మయన్మార్ సరిహద్దులోని ఛాంపియా జిల్లాలోని జొకావతర్‌ను భూకంప కేంద్రంగా గుర్తించారు. మిజోరంలో 12 గంటల్లో ఇది రెండో భూకంపం.
భూకంపం ధాటికి మిజోరం రాజధాని ఐజ్వాల్ సహా పలు జిల్లాల్లో ఇళ్లు, భవనాలు కొన్నిచోట్ల పాక్షికంగా, మరికొన్ని చోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. రహదారితోపాటు చాలాచోట్ల రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని.. ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.