శనివారం ఉదయం 10.30 గంటలకు మహారాష్ట్ర సతారా జిల్లాలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది. ఈ భూకంప ప్రభావానికి ఆ రాష్ట్రంలోని అతి పెద్ద కోయానా ఆనకట్ట కుదుపునకు గురైనట్లు అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో భూకంపం- కదిలిన ఆనకట్ట - earthquake
మహారాష్ట్ర సతారా జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది. ఆ సమయంలో రాష్ట్రంలోని అతి పెద్ద కోయానా ఆనకట్ట ప్రాంతం కుదుపునకు గురైంది.
మహారాష్ట్రలో భూకంపం- కదిలిన ఆనకట్ట
ప్రస్తుతం డ్యాం సురక్షితంగానే ఉందని, ఎటువంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించారు. భూకంపం వల్ల కోయానగర్, పటాన్ తాలూకా ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
Last Updated : Aug 15, 2020, 6:54 PM IST