తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రామాలయానికి ఉడుపి మట్టి

అయోధ్యలో రామాలయ పునాది రాయి వేసేటప్పుడు పుణ్యక్షేత్రాలు, నదులు, పవిత్ర ప్రదేశాల నుంచి మట్టిని, జలాలను తీసుకెళ్లాలని నిర్ణయించింది విశ్వహిందూ పరిషత్​. అందులో భాగంగా.. ప్రసిద్ధ క్షేత్రమైన ఉడుపి నుంచి మట్టిని తీసుకెళ్లనున్నారు. ఈ సందర్భంగా పర్యాయ అడ్మర్​ పీఠం నుంచి సేకరించిన మట్టికి ప్రత్యేక పూజలు చేశారు.

RAM MANDIR
అయోధ్య రామాలయానికి ఉడుపి మట్టి

By

Published : Jul 22, 2020, 6:49 AM IST

రామజన్మభూమిలో నిర్మించబోతున్న భారీస్థాయి రామాలయానికి ప్రసిద్ధ క్షేత్రమైన ఉడుపి నుంచి మట్టిని తీసుకువెళ్లనున్నారు. పునాది రాయి వేసేటప్పుడు పుణ్యక్షేత్రాలు, నదులు, పవిత్ర ప్రదేశాల నుంచి మట్టిని, జలాలను తీసుకువెళ్లాలని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) నిర్ణయించింది. దీనిలో భాగంగా.. నిరాటంకంగా ఆలయ నిర్మాణం కొనసాగాలని కోరుకుంటూ ఉడుపిలోని పర్యాయ అడ్మర్‌ పీఠం నుంచి సేకరించిన మట్టికి ప్రత్యేక పూజలు చేశారు. ఇత్తడి కలశంలో ఉంచిన మట్టిని వీహెచ్‌పీ నేతలకు అందించారు. ప్రస్తుతం చాతుర్మాస వ్రత దీక్షలో ఉన్నందున పెజావర్‌ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి మాత్రం అయోధ్యలో శంకుస్థాపనకు హాజరుకావడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా గర్భాలయం వచ్చేచోట ఐదు వెండి ఇటుకలను ఉంచుతామని రామ మందిరం ట్రస్టు అధికార ప్రతినిధి తెలిపారు. హిందువుల పురాణాల ప్రకారం ఇవి ఐదు గ్రహాలకు ప్రతీకలుగా నిలుస్తాయని చెప్పారు.

విరాళాల వెల్లువ

రామాలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఛైర్మన్‌ మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌ ఒక వెండి ఇటుకను బహూకరించాక ‘ఇండియా బులియన్‌ అసోసియేషన్‌’ (లఖ్‌నవూ) 36.644 కిలోల బరువైన వెండి ఇటుకను తమ విరాళంగా ఇచ్చింది. గర్భ గుడిలో ఉంచేందుకు స్వర్ణ పీఠాన్ని విరాళంగా ఇస్తామని రామ్‌దళ్‌ ట్రస్టు ప్రకటించింది.

ఉద్ధవ్‌ తప్పకుండా హాజరవుతారు: రౌత్‌

రామాలయ శంకుస్థాపనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తప్పకుండా హాజరవుతారని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ తెలిపారు. ఠాక్రేకు ఆహ్వానం అందుతుందని చెప్పారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details