తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈవీఎం స్ట్రాంగ్​రూమ్​లో పొగలు... కానీ... - Simla

హిమాచల్​ ప్రదేశ్​ కిన్నౌర్ ​జిల్లాలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్​రూమ్​లో అగ్ని ప్రమాదం సంభవించిందని భావించారు అధికారులు. హుటాహుటిన గది తెరిచి చూస్తే అలాంటిదేం లేదని తేలింది. సీసీ కెమెరాల సెట్టింగుల్లో తేడా వల్లే పొగ వచ్చినట్లు కనిపించిందని నిర్ధరణ అయింది.

ఈవీఎం స్ట్రాంగ్​రూమ్​లో పొగల కలకలం

By

Published : May 20, 2019, 4:17 PM IST

Updated : May 20, 2019, 5:06 PM IST

ఈవీఎం స్ట్రాంగ్​రూమ్​లో పొగలు!!!

హిమాచల్​ ప్రదేశ్ సిమ్లాలోని కిన్నౌర్​ జిల్లాలో ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్​రూమ్​లో పొగలు వచ్చాయన్న సమాచారం కలకలం రేపింది. సీసీ కెమెరాల్లో దృశ్యాలు చూసిన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటల నుంచి ఈవీఎంలను రక్షించేందుకు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్​రూమ్​ను తెరిచారు. తీరా చూస్తే అక్కడే ప్రమాదమూ జరగలేదు. గదిలో ఎలాంటి పొగలూ వ్యాపించలేదు.

అంతా కెమెరా మాయ...

స్ట్రాంగ్​రూమ్​లో పొగలు వచ్చినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించడానికి కారణాలు కనుగొన్నారు అధికారులు. సీసీ కెమెరాలు నైట్​మోడ్​లో ఉన్నాయి. గదిలోని ఓ మూల ధూళి కణాలు ఎగసి పడ్డాయి. ఫలితంగా... అగ్ని ప్రమాదం జరిగిందని ఊహించారు అధికారులు. చివరకు ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధరించుకుని, ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సీసీ కెమెరాలు మార్చారు. స్ట్రాంగ్​రూమ్​కు మరోసారి సీల్​ వేశారు.

ఇదీ చూడండి : మంత్రిపై వేటు- మరో పార్టీతో భాజపా కటీఫ్​!

Last Updated : May 20, 2019, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details