తెలంగాణ

telangana

ETV Bharat / bharat

50 కిలోల బంగారు దుర్గమ్మా.. చల్లగా చూడమ్మా..!

చిరు దరహాసంతో కళకళలాడే ఆ దుర్గా మాత 50 కిలోల బంగారు విగ్రహంలా కొలువుదీరింది. ఈ పుత్తడి ప్రతిమను కొలిచేందుకు వచ్చే భక్తజనంతో మండపం కిటకిటలాడుతోంది. 250 మంది కళాకారులు, 3 నెలల పాటు శ్రమించి బంగారు ప్రతిమను తయారుచేశారు.

50 కిలోల బంగారు దుర్గమ్మా.. చల్లగా చూడమ్మా..!

By

Published : Oct 4, 2019, 2:49 PM IST

Updated : Oct 4, 2019, 6:12 PM IST

50 కిలోల బంగారు దుర్గమ్మా.. చల్లగా చూడమ్మా..!
పశ్చిమ్​ బంగలో నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రతిసారీ తల్లిని వినూత్నంగా కొలుస్తున్నారు భక్తులు. ఈ సారి ఇంకాస్త ప్రత్యేకంగా 50 కిలోల బంగారు దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కోల్​కతాలోని ఓ మండపం​ కమిటీ సభ్యులు. 250 మంది కళాకారులు దాదాపు 3 నెలల పాటు శ్రమించి... ఈ ప్రతిమను రూపొందించారు.

మండపంలోని అంతర్భాగాన్ని శీశ్​ మహల్​ను తలపించేలా, బయట మాయాపుర్​లోని ఇస్కాన్ ఆలయం ప్రతిబింబించేలా​ తయారుచేశారని తెలిపారు కమిటీ ప్రధాన కార్యదర్శి సజల్​ ఘోష్​. భక్తులు ఎంతో నిష్ఠతో కొలిచే అమ్మ.. పుత్తడి బొమ్మగా మెరిసిపోతుంటే చూసేందుకు వేలాదిగా జనం పోటెత్తుతున్నారు. వారిని అదుపు చేసేందుకు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పరాశక్తికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆశ్వయుజ మాసంలో చల్లని దీవెనల కోసం హిందూజనం తాపత్రయపడుతారు. ఆ జగన్మాతను ప్రసన్నం చేసుకునేందుకు విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ఇదీ చూడండి:లంచం తీసుకున్నారని చెప్పులతో కొట్టిన మహిళలు..!

Last Updated : Oct 4, 2019, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details