తమిళనాడు వేలూరులోని వాలాజపేట్కు చెందిన డీఎస్ రాజశేఖరన్ రిటైర్డ్ మెడికల్ సూపర్వైజర్. 2020 మార్చ్ 11న జరగనున్న ఆయన కూతురు డా. రాజశ్రీ వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలనుకున్నారు. శుభలేఖలు అచ్చు వేయించి.. దిల్లీలోని ప్రధాని కార్యాలయానికి పంపించారు. అనూహ్యంగా ఆ ఆహ్వానానికి ప్రధాని స్పందించారు.
మెడికల్ సూపర్వైజర్ కూతురు పెళ్లికి మోదీ శుభాకాంక్షలు! - pm greetings
ఓ కూతురు పెళ్లికి తండ్రి పంపిన ఆహ్వానానికి మురిసిపోయారు ప్రధాని నరేంద్ర మోదీ. పెళ్లికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. ప్రధాని లెటర్ ప్యాడ్ పైనే కాబోయే పెళ్లి కూతురికి శుభాకాంక్షలు తెలిపారు.
మెడికల్ సూపర్వైజర్ కూతురు పెళ్లికి మోదీ శుభాకాంక్షలు!
'పెళ్లికి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందనీ, కొత్త జంటకు నా శుభాకాంక్షలు' అని తెలుపుతూ మోదీ సంతకంతో పీఎం కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. పోస్ట్‌లో పంపిన శుభలేఖకు మోదీ స్పందించిన తీరుతో ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇదీ చూడండి: శ్వేత నాగు ఊళ్లోకి వచ్చి బుసలు కొట్టింది!
Last Updated : Sep 30, 2019, 2:10 AM IST