తమిళనాడు, చెన్నైలో నదిలో దూకిన ఓ తాగుబోతు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు.
చెన్నై పుదుపెట్టయికి చెందిన యువకుడు బుధవారం తప్పతాగి కూవమ్ నదిలో దూకాడు. కొన్ని గంటల పాటు ఈత కొట్టాడు కానీ, బయటికి మాత్రం రాలేదు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది పడవ సాయంతో తీవ్రంగా శ్రమించి యువకుడిని ఒడ్డుకు చేర్చారు.