తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తలుపులు తెరవలేదని ఇల్లు తగలబెట్టిన తాగుబోతు - మద్యం మత్తులో దారుణాలు

మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. తలుపులు తెరవలేదనే కోపంతో.. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే నిప్పంటించాడు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది.

burnt alive 7 people
తలుపులు తెరవలేదని ఇల్లు తగలబెట్టిన తాగుబోతు

By

Published : Jan 15, 2021, 1:53 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో మద్యం తాగిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య ఇంటి తలుపులు తెరవలేదనే కోపంతో కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండగానే.. నిప్పు అంటించాడు.

ఏం జరిగింది?

మద్యం తాగిన సదరు వ్యక్తి శుక్రవారం ఉదయం నాలుగింటికి ఇంటికి వచ్చాడు. అయితే.. తలుపులు తెరిచేందుకు అతడి భార్య నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు.. ఇంటిని తగలబెట్టాడు. ఆ సమయంలో భార్య, పిల్లలతో సహా ఏడుగురు వ్యక్తులు ఇంట్లో ఉన్నారని కాన్పుర్​ ఎస్పీ దీపక్​ బుకర్​ తెలిపారు.

ఈ ఘటనలో మనీషా అనే చిన్నారిని పోలీసులు రక్షించారు. కాలిన గాయాలతో బాధపడుతున్న మరో ఆరుగురిని ఉర్సలా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జుహీ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:కర్ణాటకలో రోడ్డు ప్రమాదం- 11మంది మృతి

ABOUT THE AUTHOR

...view details