తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాస్క్​ లేదని చలానా​ కట్టమంటే పోలీసులనే కొట్టాడు! - corona virus in india

రాజస్థాన్​లో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. కరోనా అంటే భయంలేకుండా, ముఖానికి మాస్క్​ లేకుండా రోడ్లపై తిరిగాడు. చలానా​ కట్టమన్నందుకు పోలీసులపైనే తిరగబడ్డాడు.

person-beat-up-with-police-on-challan-deducted-in-jodhpur
మాస్క్​ లేదని చలానా​ కట్టమంటే.. పోలీసులనే కొట్టాడు!

By

Published : Jun 5, 2020, 1:31 PM IST

కొవిడ్​కు తన-మన భేదాలేమీ లేవు.. ఎవరు దొరికితే వారిని వేటాడేస్తోంది. అందుకే జాగ్రత్తలు పాటించకుంటే.. వైరస్ దాడికి బలవ్వక తప్పదని ప్రభుత్వాలు గొంతు చించుకుంటున్నాయి. అయితే, రాజస్థాన్​లో ఓ మందు బాబు మాత్రం కరోనాను లెక్క చేయకుండా రోడ్డెక్కాడు. మాస్క్​ ఏదని అడిగినందుకు పోలీసులపైనే తిరగబడి వీరంగం సృష్టించాడు.

మాస్క్​ లేదని చలానా​ కట్టమంటే.. పోలీసులనే కొట్టాడు!

జోధ్​పుర్​ దేవనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో.. గురువారం మధ్యాహ్నం తప్పతాగి రోడ్లపై తిరుగుతున్నాడు ముఖేశ్​ కుమార్​. మాస్క్​ పెట్టుకోకుండా పోలీసుల కంటపడ్డాడు. దగ్గరికి పిలిచి మాస్క్​ ఏదని అడిగితే అడ్డదిడ్డంగా సమాధానాలిచ్చాడు. దీంతో చలానా​ కట్టమన్నారు పోలీసులు. అంతే, నన్నే చలాన్​ కట్టమంటావా అంటూ కోపంతో ఊగిపోయాడు ముఖేశ్​. పోలీసులపైనే చేయిజేసుకున్నాడు.

'ఫ్లాయిడ్​' దృశ్యం​!

ముఖేశ్​ను అదుపు చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. అయితే ముఖేశ్​ను ఆపేందుకు పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. అమెరికాలో జార్జి​ ఫ్లాయిడ్​పై అక్కడి పోలీసులు ప్రవర్తించినట్లు మోకాలు మెడపై పెట్టి మందుబాబుని కదలనీకుండా చేశారు కానిస్టేబుళ్లు. చుట్టూ గుమిగూడిన జనం ఈ దృశ్యాలను సెల్​ఫోన్లలో బంధించారు.

మాస్క్​ లేదని చలానా​ కట్టమంటే.. పోలీసులనే కొట్టాడు!

అతికష్టం మీద ముఖేశ్​ కుమార్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. దీంతో కానిస్టేబుల్​ చెప్పిన వివరాల ప్రకారం ముఖేశ్​పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2019లో ముఖేశ్​ తన తండ్రి కన్ను పగలగొట్టినట్టు రికార్డుల్లో ఉంది.

ఇదీ చదవండి:కొత్తిమీర రైతుకు.. గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు

ABOUT THE AUTHOR

...view details