తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోంలో రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం - afing in assam

అసోంలో నిషేధిత మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుుకున్నారు. వీటి ధర రూ.8 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు.

drugs worth Rs. 8 crore seized from Assam town
అసోంలో రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

By

Published : Dec 7, 2020, 5:20 AM IST

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అసోం పోలీసులు మరో విజయం సాధించారు. హెరాయిన్​ సహా రూ.8 కోట్ల విలువైన నిషేధిత మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాలు

దక్షిణ అసోం జిల్లాలోని కొంతమంది అనుమానిత వ్యక్తులపై కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. పక్కా ప్రణాళికతో ఆదివారం సోదాలు నిర్వహించగా మాదకద్రవ్యాల వ్యవహారం బయటపడింది. 2 కిలోల హెరాయిన్​, 10 కిలోల అఫింగ్​, క్వింటాల్​ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్య ఉంటుందని తెలిపారు.

అసోం డ్రగ్స్​ కేసులో నిందితులు

దింగ్​ రెవెన్యూ పరిధిలోని సోనారిగావ్​లో హబిల్​ అలీ ఇంట్లో ఇవి బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో హబిల్​ అలీ, మొఫిదుల్​ హాక్​, బహదుల్​ అలమ్​ అనే ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:కరోనా ప్లాన్​'తో భర్తనే కిడ్నాప్​ చేయించిన భార్య

ABOUT THE AUTHOR

...view details