తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్లాస్మా చికిత్స' క్లినికల్ ట్రయల్స్​కు లైన్​ క్లియర్! - కరోనావైరస్ చికిత్స

కరోనాకు ప్లాస్మా చికిత్స ట్రయల్స్ నిర్వహించేందుకు ఐసీఎంఆర్​కు డ్రగ్​ కంట్రోలర్ జనరల్​ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. కరోనా విజృంభణ నేపథ్యంలో నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం ఐసీఎంఆర్​ ప్రతిపాదనను వేగంగా ఆమోదించినట్లు డీజీసీఐ స్పష్టం చేసింది.

VIRUS-ICMR-CLINICAL TRIAL
ప్లాస్మా చికిత్స

By

Published : Apr 18, 2020, 1:30 PM IST

కరోనా బాధితుల్లో ప్లాస్మా చికిత్సకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) ఆమోదం తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) చేసిన ప్రతిపాదనకు ఈమేరకు పచ్చజెండా ఊపింది.

ట్రయల్స్​ నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న సంస్థల జాబితాను కేంద్ర ఔషధ ప్రమాణాలు, నియంత్రణ సంస్థ (సీడీఎస్​సీఓ)కు ఐసీఎంఆర్​ అందించింది. ఐసీఎంఆర్​తో కలిసి ఆ సంస్థలు ట్రయల్స్ నిర్వహించవచ్చని డీజీసీఐ స్పష్టం చేసింది.

"ఐసీఎంఆర్​ ప్రతిపాదనను ఏప్రిల్​ 13న జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో ఆమోదించాం. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో వేగంగా నిర్ణయం తీసుకున్నాం. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సీడీఎస్​సీఓ నుంచి అభ్యంతరాలు ఉండకుండా నిబంధనలను సవరించాం."

- డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా

కరోనా బాధితులకు ప్లాస్మా చికిత్స ప్రక్రియకు సంబంధించి ఐసీఎంఆర్​ స్పష్టమైన నిబంధనలను రూపొందించిందని డీజీసీఐ ప్రకటన తెలిపింది.

ప్లాస్మా థెరపీలో... కోలుకున్న రోగుల రక్తంలోని యాంటీబాడీలను సేకరించి కరోనాతో తీవ్రంగా బాధపడుతున్నవారిలో ప్రవేశపెట్టి చికిత్స అందిస్తారు.

ఇదీ చూడండి:కరోనా కట్టడికి టీబీ టీకా వాడకంపై పరిశోధనలు

ABOUT THE AUTHOR

...view details