ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజూకు పెరిగిపోతోంది. శీతలగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. 'జూ'లోని వన్యప్రాణులకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ 'జూ' అధికారులు వినూత్న ఏర్పాట్లు చేశారు. పులులు, సింహాలకు హీటర్లు ఏర్పాటు చేసి చలి నుంచి వాటికి రక్షణ కల్పిస్తున్నారు.
చలిని తట్టుకునేందుకు పులికి హీటర్లు! - చలికి తట్టుకునేలా ఏర్పాట్లు
ఉత్తరాది రాష్ట్రాల్లో శీతలగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో మనుషులతో పాటు జంతువులకు తిప్పలు తప్పడం లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ 'జూ'లోని పులులు, సింహాలకు చలి నుంచి రక్షణ కోసం హీటర్లు ఏర్పాటు చేశారు.
![చలిని తట్టుకునేందుకు పులికి హీటర్లు! Drop in Temperature in Kanpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9986907-416-9986907-1608789963416.jpg)
చలిని తట్టుకునేందుకు పులికి హీటర్లు!
చలిని తట్టుకునేందుకు పులికి హీటర్లు!
శీతలగాలులను ఆపేందుకు ప్రతి బోనుకు టార్పాలిన్లు ఏర్పాటు చేశారు. నేలమీద చల్లగా ఉంటుంది కాబట్టి చిరుతలు.. ఉండే బోనులో కర్రలతో వాటి కోసం నిర్మాణాలు ఏర్పాటు చేశారు. చలి తీవ్రత జూలో జంతువులపై పడకుండా.. అన్ని రకాల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:చలి పంజా: నెహ్రూ జూపార్కులో మూగజీవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
Last Updated : Dec 24, 2020, 11:52 AM IST