మహమ్మారి కరోనా దేశంలో అంతకంతకూ విస్తరిసోంది. రోగుల సంఖ్య పెరిగినకొద్దీ వైద్యులకు సవాలుగా మారుతుంది. పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైద్యులకు వైరస్ సోకే ప్రమాదం అధిక స్థాయిలోనే ఉంది. వైద్యులను వైరస్ ప్రమాదం నుంచి రక్షించేందుకు వివిధ సంస్థలు వినూత్న పరికరాలను ఆవిష్కరిస్తున్నాయి.
తక్కువ ధరతో తయారు చేసిన వెంటిలేటర్ నుంచి శానిటైజ్ చేసే డ్రోన్ల వరకు, ఆహారం ఔషధాలు అందించే రోబోలు, కిరాణా సరకులు, డబ్బును శుభ్రపరిచే యూవీ సాంకేతిక ట్రంక్లను పలు సంస్థలు, అంకురాలు ఆవిష్కరిస్తున్నాయి. కరోనాపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఈ ఉపకరణలు తోడ్పడుతున్నాయి.
వైద్యులకు రక్షణ కవచాలు
ఆసుపత్రుల్లో వైద్యులను వైరస్ నుంచి కాపాడేవాటిలో ప్రత్యేక వ్యక్తిగత రక్షణ దుస్తులు, అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన వైరస్ పరీక్ష కిట్లు, డిజిటల్ స్టెతస్కోపు, రోబోలు ముఖ్యమైనవి.
కరోనా రోగులకు ఐసోలేషన్ ప్యాడ్స్, సంప్రదాయ ఆక్సిజన్ మాస్కులకు ప్రత్యామ్నాయంగా బబుల్ హెల్మెట్లు వంటివి వచ్చాయి.
మొబైల్ యాప్స్
కరోనా సోకిన వ్యక్తితో పరిచయం ఉన్నవారి ఆచూకీ తెలుసుకోవడానికి, ఆ వ్యక్తి నుంచి ఇతరులు ఏ మేరకు కరోనా బారిన పడే అవకాశం ఉందనే పలు అంశాల గురించి తెలుసుకోవడానికి 'గో కరోనా గో' నుంచి 'శాంపార్కో మీటర్' వరకు ఎన్నో మొబైల్ అప్లికేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ క్యారంటైన్ కేంద్రం నుంచి ఎవరైనా తప్పించుకుంటే వారి జాడ తెలుసుకునేలా బెంగుళూరు ఐఐటీ, ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా ఓ యాప్ను రూపొందించాయి.
వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి