విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకుంది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. మయన్మార్ సరిహద్దు గుండా భారత్‌లోకి వస్తున్న రెండు ట్రక్కులను అధికారులు తనిఖీ చేయగా ఈ బంగారం గుట్టు రట్టయింది. వారి వద్ద నుంచి మొత్తం 400 బంగారం కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 66.4 కిలోల ఈ బంగారం విలువ రూ.35 కోట్లుగా ఉంటుందని తెలిపారు.
రూ. 35 కోట్ల విలువైన బంగారం పట్టివేత - డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు
64 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. మయన్మార్ నుంచి భారత్‌కు తీసుకువస్తున్నట్లు చెప్పారు.

64 కిలోల బంగారం అక్రమ రవాణాను పట్టివేత
బంగారాన్ని డీజీల్ ట్యాంకులో దాచిపెట్టి, పంజాబ్‌కు చేరవేసేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను నిర్బంధించారు.