తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి అత్యంత కఠిన పరిస్థితులు ఉంటాయి. శీతాకాలంలో ఈ ఇబ్బందులు మరింత తీవ్రమవుతాయి. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇక్కడ గస్తీ కీలకం కానుంది. అయితే, సైనికులకు ఈ సమయంలో ఆహారం అందించటం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ.
చలికాలంలో ఈ ప్రాంతంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ ఆహార ఉత్పత్తి కష్టమైన పని. దీన్ని అధిగమించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) కృషి చేస్తోంది. ఈ కఠిన పరిస్థితుల్లో భారత సైన్యం కోసం కూరగాయలు పండించేందుకు ప్రయోగాలు చేస్తోంది.
వివిధ సాంకేతికతలతో..
డీఆర్డీఓ అధీనంలోని ఎత్తయిన ప్రాంతాల పరిశోధనల రక్షణ సంస్థ(డీఐహెచ్ఏఆర్) ఈ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఇందుకు పాసివ్ గ్రీన్హౌస్, జీరో ఎనర్జీ ఆధారిత నిల్వ, మైక్రోగ్రీన్ వంటి సాంకేతికతలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు సంస్థ డైరెక్టర్ ఓం ప్రకాశ్ చౌరాసియా.