తెలంగాణ

telangana

By

Published : Jul 4, 2020, 10:32 AM IST

Updated : Jul 4, 2020, 11:16 AM IST

ETV Bharat / bharat

కర్నల్ సంతోష్​బాబు పేరుతో ఐసీయూ యూనిట్

తూర్పు లద్దాఖ్ గల్వాన్ ఘర్షణలో అమరులైన భారత సైనికుల పేర్లను దిల్లీలో ఏర్పాటు చేసిన సర్ధార్ వల్లభ్​భాయ్ పటేల్ ఆసుపత్రి వార్డులకు పెట్టాలని డీఆర్​డీఓ నిర్ణయించింది. అలాగే ఆసుపత్రిలోని ఐసీయూ, వెంటిలేటర్ వార్డుకు కర్నల్ సంతోష్​బాబు పేరు పెడుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఆసుపత్రిని కేంద్రమంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్ సింగ్​లు ఆదివారం ప్రారంభించనున్నారు.

DRDO to name its COVID hospital wards after soldiers killed in Galwan clash, ICU unit named after Col Santosh Babu
కర్నల్ సంతోష్​బాబు పేరుతో ఐసీయూ యూనిట్

దిల్లీలోని సర్ధార్ వల్లభ్​భాయ్ పటేల్​ కొవిడ్ ఆసుపత్రి వార్డులకు గల్వాన్ ఘర్షణలో అమరులైన వీర జవాన్ల పేర్లు పెట్టాలని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) నిర్ణయించింది. ఈ మేరకు డీఆర్​డీఓ ఛైర్మన్​ సాంకేతిక సలహాదారు సంజీవ్ జోషి తెలిపారు.

జూన్ 15న లద్దాఖ్​ వద్ద జరిగిన సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటనలో చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం సంభవించింది.

అమిత్​షా చేతుల మీదుగా

దిల్లీలో కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన సర్ధార్ వల్లభ్​భాయ్ పటేల్ కొవిడ్ ఆసుపత్రిని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​లు ఆదివారం ప్రారంభించనున్నారు.

కర్నల్ సంతోష్​బాబు పేరుతో..

వెయ్యి పడకల ఈ ఆసుపత్రిలో... పూర్తి ఎయిర్ కండిషన్​తో కూడిన ప్రత్యేక ఇంటెన్సివ్​ కేర్ యూనిట్ పడకలు కూడా ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలోని ఐసీయూ, వెంటిలేటర్ వార్డుకు.. అమరవీరుడు కర్నల్ బి.సంతోష్​బాబు పేరు పెట్టారు.

10,000 పడకల ఆసుపత్రి

దిల్లీ-హరియాణా సరిహద్దుకు సమీపంలోని ఛతార్పుర్ ప్రాంతంలోని రాధాస్వామి సత్సంగ్​ బియాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొవిడ్​ 19 ఆసుపత్రి దిల్లీలోనే అతిపెద్దది. ఇందులో ఒకేసారి 10 వేల మందికి చికిత్స అందించవచ్చు.

ఈ ఆసుపత్రిలో కరోనా రోగులకు... వైద్య సిబ్బందితో పాటు 2 వేలకు పైగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సెంట్రల్ ఆర్మ్ పోలీసు ఫోర్స్ (సీఏపీఎఫ్​) సిబ్బంది కూడా సేవలందిస్తున్నారు.

ఇదీ చూడండి:'చైనా, పాక్‌ విద్యుత్తు పరికరాలు దిగుమతి చేసుకోం'

Last Updated : Jul 4, 2020, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details