తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై యుద్ధంలో సరికొత్త ఆయుధం- యూవీ బ్లాస్టర్​ - కరోనా వైరస్ జాగ్రత్తలు

కార్యాలయాలు, కర్మాగారాలు, రద్దీగా ఉండే ప్రాంతాలను శుభ్రపరిచేందుకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించింది. అతినీలలోహిత కిరణాల సాయంతో పనిచేసే పూర్తి రసాయన రహిత 'యూవీ బ్లాస్టర్​' టవర్​ను రూపొందించింది.

DEF-VIRUS-DRDO
యూవీ బ్లాస్టర్​

By

Published : May 5, 2020, 6:07 AM IST

కరోనాపై పోరాటంలో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) సరికొత్త పరికరాన్ని రూపొందించింది. కరోనా వైరస్​ ఇన్ఫెక్షన్​ సోకకుండా గదులను శుభ్రపరిచేందుకు రసాయన రహిత అతినీలలోహిత కిరణాల (యూవీ) క్రిమిసంహారక టవర్​ను తయారు చేసింది.

దీనికి 'యూవీ బ్లాస్టర్​' గా నామకరణం చేసింది రక్షణ మంత్రిత్వ శాఖ. దీనిని దిల్లీలోని డీఆర్​డీఓకు చెందిన పరిశోధన కేంద్రం లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్​ రూపొందించింది.

"12x12 చదరపు అడుగులు ఉన్న గదిని ఈ పరికరం 10 నిముషాలలో పూర్తిగా శానిటైజ్ చేస్తుంది. 400 చదరపు అడుగుల గదిని 30 నిమిషాల్లో శుభ్రం చేస్తుంది."

- రక్షణ శాఖ

ఈ పరికరం టవర్ ఆకారంలో ఉంటుంది. 254 నానోమీటర్ తరంగ ధైర్ఘ్యంతో పనిచేసే 43 వాట్ల యూవీ-సీ బల్బులు ఆరు ఇందులో ఉంటాయి. 360 డిగ్రీల కాంతి ప్రసారితం అవుతుంది. ఈ టవర్​ను మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా రిమోట్‌తో ఆపరేట్ చేయవచ్చు.

"ఆఫీసులు, ల్యాబొరేటరీలు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండే ఆఫీసులు, పరిశోధనశాలల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే విమానాశ్రయాలు, షాపింగ్ మాళ్లు, మెట్రో స్టేషన్లు, హోటళ్లు, కర్మాగారాలను ఈ యూవీ బ్లాస్టర్‌తో శానిటైజ్ చేయవచ్చు."

- రక్షణ శాఖ

ABOUT THE AUTHOR

...view details