తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ వల్లే శాస్త్రవేత్తలు తిరిగి పని ప్రారంభించారు'

భారత్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్​ చంద్రయాన్​-2పై స్పందించారు డీఆర్​డీఓ ఛైర్మన్​ సతీశ్​ రెడ్డి.. ఇస్రో శాస్త్రవేత్తల శ్రమను అభినందించారు. ఇంత క్లిష్టమైన మిషన్​.. విజయానికి 99శాతం చేరువైందని ఉద్ఘాటించారు. ప్రధాని ప్రోత్సాహం శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగపడిందన్నారు.

'మోదీ వల్లే శాస్త్రవేత్తలు తిరిగి పని ప్రారంభించారు'

By

Published : Sep 9, 2019, 6:12 AM IST

Updated : Sep 29, 2019, 10:57 PM IST

చంద్రయాన్​-2 విఫలమైందన్న వార్తలను రక్షణ పరిశోధన- అభివృద్ధి సంస్థ డీఆర్​డీఓ ఛైర్మన్​ జీ. సతీశ్​ రెడ్డి ఖండించారు. ఏ శాస్త్రీయ పరిశోధనల్లోనైనా సమస్యలు తప్పవని తెలిపిన్​ సతీశ్​... ఇస్రో శాస్త్రవేత్తల శ్రమను ప్రశంసించారు.

ఇస్రోకు డీఆర్​డీఓ ఛైర్మన్​ మద్దతు

"ఇదొక ఎదురుదెబ్బ అనడాన్ని నేను అంగీకరించను. చంద్రయాన్​-2 ఎంతో క్లిష్టమైన మిషన్​. విజయానికి 99శాతం చేరువైంది. కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయాయి. నా వరకు ఇదొక ఘన విజయం. ఏ శాస్త్రీయ ప్రయాత్నాల్లోనైనా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇక్కడ మనం దేశం సాధించిన సాంకేతిక సామర్థ్యాన్ని గుర్తించాలి. శాస్త్రవేత్తలు ఏం సాధించారో చూడాలి. అందుకే ఇది భారత్​కు గొప్ప విజయం అని భావిస్తున్నా. ఇది అంతరిక్ష విభాగంలో దేశానికి సుధీర్ఘ కాలంలో మార్గనిర్దేశకం అవుతుంది."
---- జీ. సతీశ్​ రెడ్డి, డీఆర్​డీఓ ఛైర్మన్​.

శనివారం.. విక్రమ్​ ల్యాండర్​ ఆచూకీ కనిపించని నేపథ్యంలో భావోద్వేగానికి లోనైన ఇస్రో ఛైర్మన్​ కే. శివన్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. దీనిపై స్పందించిన డీఆర్​డీఓ ఛైర్మన్​.. శాస్త్రవేత్తలకు మోదీ ఇచ్చిన భరోసాపై హర్షం వ్యక్తం చేశారు. మోదీ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇస్రో శాస్త్రవేత్తలు తిరిగి పనిచేయడం మొదలుపెట్టి.. విక్రమ్​ను కనుగొన్నారని అభిప్రాయపడ్డారు.

భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలపై పాకిస్థాన్​ మంత్రులు చేస్తున్న దుష్ప్రచారాలను సతీశ్​ రెడ్డి తిప్పికొట్టారు. చంద్రయాన్​-2 వంటి క్లిష్ట మిషన్​లను అర్థం చేసుకునే సామర్థ్యం వారికి లేదని విమర్శించారు.

ఇదీ చూడండి:- విక్రమ్​ కనిపించింది.. ఆశలు చిగురించాయి

Last Updated : Sep 29, 2019, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details