తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రష్యా వ్యాక్సిన్​కు భారత్​లో మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్​

రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్​ వి' పై భారత్​లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్​ జరగనున్నాయి. ఇందుకోసం డాక్టర్ రెడ్డీస్​ లేబొరేటరీస్ సిద్ధమవుతోంది. ఈ మేరకు అనుమతి కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు సంస్థ ప్రతినిధులు.

dr reddys planning for third phase clinical trials of russia sputnik v vaccine
'స్పుత్నిక్‌ వి'పై డాక్టర్‌ రెడ్డీస్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్​

By

Published : Oct 4, 2020, 6:07 AM IST

రష్యా తయారు చేసిన కొవిడ్‌-19 టీకా 'స్పుత్నిక్‌ వి'పై మనదేశంలో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించటానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సన్నద్ధమవుతోంది. దీనికి అనుమతి కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు కంపెనీ దరఖాస్తు చేసింది. 'స్పుత్నిక్‌ వి' టీకాను మనదేశంలో పరీక్షించి, ఆ తర్వాత తయారు చేసి విక్రయించటానికి డాక్టర్‌ రెడ్డీస్‌, రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ (రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.

అన్ని అనుమతులు వచ్చాక డాక్టర్‌ రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల 'స్పుత్నిక్‌ వి' టీకాను సరఫరా చేయటానికి ఆర్‌డీఐఎఫ్‌ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డాక్టర్‌ రెడ్డీస్‌ తగిన సన్నాహాలు చేపట్టింది. రష్యాలో ఈ టీకాపై ఇప్పటికే మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details