దేశంలో బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం 'ఇన్విస్టా' పేరిట జనరిక్ డ్రగ్‌ను విడుదల చేసింది దిగ్గజ ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ. డాసాటినిబ్ ఔషధం ఫార్ములేషన్ ఆధారంగా ఈ డ్రగ్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిపింది.
పేటెంట్ ముగిసిన ఒక్క రోజులోనే...
డాసాటినిబ్పై పేటెంట్ బ్రిస్టల్-మైర్స్-స్విబ్ పేరిట ఉంది. భారత్‌లో ఈ పేటెంట్ ఏప్రిల్ 12న ముగిసింది. మరుసటి రోజే జనరిక్ వెర్షన్‌ను విడుదల చేసింది డాక్టర్ రెడ్డీస్.
క్రానిక్ మైలాయిడ్ లుకేమియా (సీఎంఎల్) చికిత్సలో ఉపయోగించే ఇన్విస్టా 50, 70, 100 మిల్లీగ్రాముల మాత్రలలో అందుబాటులో ఉంటుంది.