తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'స్పుత్నిక్​-వి' హ్యూమన్​ ట్రయల్స్ ​ కోసం రెడ్డీస్​కు అనుమతి - DCGI Approval to sputnik-v human trails

రష్యా తయారు చేసిన కొవిడ్-19 టీకా 'స్పుత్నిక్​-వి'పై మన దేశంలో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్​కు డీసీజీఐ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ఈ పరీక్షలను డాక్టర్​ రెడ్డీస్​ లేబోరేటరీస్​ నిర్వహించనుంది.

DCGI Approval to Conduct Russia's COVID-19 vaccine
'స్పుత్నిక్​-వి' హ్యూమన్​ ట్రయల్స్ ​ కోసం రెడ్డీస్​కు అనుమతి

By

Published : Oct 17, 2020, 5:44 PM IST

రష్యా కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్​-వి'పై భారత్​లో క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించడానికి డాక్టర్​ రెడ్డీస్​ లేబోరేటరీస్​కు అనుమతులు ఇచ్చింది డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ). ఈ మేరకు సంస్థ శనివారం అధికారిక ప్రకటన చేసింది.

"భారత్​లో క్లినికల్​ ట్రయల్స్​ చేపట్టేందుకు అంగీకారం తెలపడం మంచి పరిణామం. కరోనా కాలంలో సురక్షితమైన, సమర్థవంతమైన టీకా తెచ్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం."

-జీవీ ప్రసాద్​, డా.రెడ్డీస్​ సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​

'స్పుత్నిక్​-వి' టీకాను మనదేశంలో పరీక్షించి, ఆ తర్వాత తయారు చేసి విక్రయించటానికి డాక్టర్‌ రెడ్డీస్.. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ (రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగస్వామ్యం పొందిన డాక్టర్‌ రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల 'స్పుత్నిక్​-వి' టీకాను సరఫరా చేయటానికి ఆర్‌డీఐఎఫ్‌ అంగీకరించింది. ఈ టీకాపై ఇప్పటికే మూడో దశ క్లినికల్‌ పరీక్షలను నిర్వహిస్తోంది రష్యా. ఒప్పందంలో భాగంగా రష్యాలోని మూడో ట్రయల్స్​ డాటాను రెడ్డీస్​తో పంచుకోనున్నారు.

ఆగస్టు 11న 'స్పుత్నిక్​-వి' వ్యాక్సిన్​ను గమలేయా ఇన్‌స్టిట్యూట్‌, రష్యా ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్తంగా విడుదల చేశాయి.

ఇదీ చూడండి: రష్యా​ టీకా తీసుకున్న వారిలో సైడ్​ ఎఫెక్ట్స్​!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details