తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆయన జీవితం భూమికే అంకితం - Indian ecologists

ఎవరి అభిరుచుల మేరకు వారు ఆయా రంగాల్లో రాణిస్తుంటారు. అయితే తన ఆశయం కోసం జీవితం మొత్తం శ్రమించాడు డాక్టర్​ దేబల్​ దేబ్. వ్యవసాయ శాస్త్రవేత్త కాకపోయినా.. తన జీవితాన్ని భూమికే అంకితం చేశాడు. సంప్రదాయ వరిపై మక్కువతో అరుదైన వరి రకాలు అంతరించిపోకుండా విశేషంగా కృషి చేస్తున్నాడు. ఇలా శ్రమిస్తూ ఇప్పటివరకు 1400కిపైగా వరి విత్తనాలను సంరక్షించిన దేబల్​దల్​పై ప్రత్యేక కథనం..

DR DEBAL DEB CONSERVING VARIETIES OF TRADITIONAL RICE CROPS
వరి పరిరక్షణ కోసం.. ఆయన జీవితం భూమికే అంకితం

By

Published : Sep 27, 2020, 2:28 PM IST

వరి పరిరక్షణ కోసం.. ఆయన జీవితం భూమికే అంకితం

మనసుకు నచ్చిన పనిలో.. అభిరుచుల మేరకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు మనమంతా కృషిచేస్తాం. అలాంటి ఓ ఆశయంతోనే జీవితం మొత్తం శ్రమిస్తున్న ఓ వ్యక్తిని ఇప్పుడు చూడబోతున్నాం. ఎన్నో అరుదైన వరి రకాలు అంతరించిపోకుండా కాపాడేందుకు ఆయన కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం పండిస్తున్న అనేక రకాలనూ సంరక్షించేందుకు ఎంతో కష్టపడతున్నాడు. ఇప్పటివరకూ 1,452 రకాల సంప్రదాయ వరి విత్తనాలను పదిలపరిచాడు. వ్యవసాయ శాస్త్రవేత్త కాకపోయినా.. తన జీవితంలో ఎక్కువ భాగం భూమికే కేటాయించాడు. హానికారక విత్తనాలపై ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ఆయనే పశ్చిమబంగాకు చెందిన ప్రముఖ జీవావరణ శాస్త్రవేత్త డాక్టర్ దేబల్ దేబ్. ఒడిశాలోని రాయగడ జిల్లా బిసం కట్టక్బ్లాక్లోని ఓ వెనుకబడిన గ్రామంలో ఆయన పనిచేస్తాడు.

"ప్రతిరకానికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతి రకమూ విభిన్నమే. ఒకరకం వరిలో ఎక్కువ విటమిన్లు ఉంటే, మరోరకానికి ఎక్కువచౌడును తట్టుకునే సామర్థ్యం ఉండొచ్చు. కొన్నిరకాల్లో ఎక్కువ ఐరన్ పాళ్లు ఉంటాయి. ప్రతి రకం భిన్నమైన ప్రత్యేకతలతో ఉంటుంది."

- డా. దేబల్ దేబ్, జీవావరణ శాస్త్రవేత్త

"60 నుంచి 70 రకాల విత్తనాలు ఒక పొలంలో విత్తుతున్నాం. క్రాస్ పాలినేషన్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నాణ్యతలో ఎక్కడా రాజీపడబోం. విత్తనాలు నిల్వ చేసేందుకు మాకు ఓ గిడ్డంగి ఉంది. రైతుల కోసం విత్తనాలను అక్కడ దాచిపెడతాం."

- దేబ్గులాల్ భట్టాచార్య, దేబల్ దేబ్ అనుచరుడు

క్షీణిస్తోన్న భూమి సారం..

ఒకప్పుడు లక్షా 10 వేలకు పైగా సంప్రదాయ వరి రకాలుండేవి. స్థానిక భౌగోళిక, వాతావరణ పరిస్థితులు బట్టి, ఒక్కో ప్రాంతంలో ఒక్కో వరిని పండించేవారు. 1955 నుంచి, కార్పొరేట్ సంస్థలు రైతులకు అధిక దిగుబడుల ఆశచూపడం ప్రారంభమైంది. హరిత విప్లవం పేరిట రైతుల నుంచి సంప్రదాయ విత్తనాలు తీసుకుని, వారికి హైబ్రిడ్ విత్తనాలు అందించారు. విత్తన గాదెలు ఇప్పుడు ఎవరి ఇళ్లలోనూ కనిపించవు. ఈ విత్తనాలతో పంట పండించేందుకు పెద్ద మొత్తంలో రసాయన ఎరువులు పిచికారీ చేస్తున్నందువల్ల.. భూమిలో సారం క్రమంగా తగ్గిపోతోంది. మొత్తంగా హైబ్రిడ్ విత్తనాలను ఏళ్ల తరబడి వాడటం వల్ల భూమి బీడు బారుతోంది.

కోల్​కతా నుంచి అందుకే వచ్చారట

"సంప్రదాయ వరి విత్తనాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ రోజుల్లో హైబ్రిడ్ విత్తనాలు, అధిక దిగుబడినిచ్చే వరి విత్తనాలే వాడుతున్నారు. వారి సంప్రదాయ వరి గింజలను ప్రజలు మరిచిపోతున్నారు. దేబ్ సర్ మాకు సూచనలిచ్చేందుకు కోల్​కతా నుంచి వచ్చారు. మొదట ఆయన బంకురా జిల్లాలో ప్రయోగాలు చేసేవారు. అక్కడ నీటి కొరత ఉండడం వల్ల 2011లో ఇక్కడికి వచ్చారు."

- మహేంద్ర నౌరి, కరందిగూడ వాసి

గుర్తించకపోతే ప్రమాదమే..

ప్రస్తుతం పొలాల్లో పెరుగుతున్న మొక్కలు.. ఆధునిక పద్ధతుల్లో పండిస్తున్న వరి అని రైతులంతా అంగీకరించాలి. ఈ నిజాన్ని గుర్తించాల్సిన అవసరముంది. లేకపోతే ప్రస్తుతం మనం వెళ్తున్న దారి మనలాంటి వ్యవసాయాధారిత దేశానికి ప్రమాదకరం. ఈ విషయాన్ని ఇప్పటికే డాక్టర్ దేబ్ రైతులకు సూచించారు. ఇలాంటి విత్తనాల మీద ప్రభుత్వం నిషేధం విధిస్తే తప్ప జీవావరణంపై దుష్ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది.

ఇదీ చదవండి:భారత నేలలో ఇండోనేసియా నీలి వరిపైరు!

ABOUT THE AUTHOR

...view details