భర్త ఇంటి ముందే భార్య మృతదేహానికి అంత్యక్రియలు చేసిన విచిత్ర ఘటన కర్ణాటక హోసకోట్ మండలం నాదవతి గ్రామంలో జరిగింది. వరకట్నం కోసం తమ కూమార్తెను వేధించేవారని... అది ఇవ్వనందుకు చంపేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
భర్త ఇంటి ముందే భార్య అంత్యక్రియలు - వరకట్నం కోసం భార్య చంపిన భర్త
కర్ణాటక హోసకోట్ మండలం నాదవతి గ్రామంలో భర్త ఇంటి ముందే అతని భార్య అంత్యక్రియలను నిర్వహించారు మృతురాలి కుటుంబ సభ్యులు. తమ కుమార్తెను కట్నం కోసం వేధించి చంపేశారని.. అందుకే నిరసనగా ఇలా చేసినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు.
భర్త ఇంటి ముందే భార్య అంత్యక్రియలు
చనిపోయిన మహిళ పేరు భావన. ఆమెది కూడా నాదవతి గ్రామమే. అదే ఊరికి చెందిన గజేంద్ర అనే వ్యక్తితో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అయితే ఆదివారం భావన మృతదేహం అనుమానాస్పద స్థితిలో రైల్వేట్రాక్‌పై దొరికింది. గత కొన్ని రోజులుగా కట్నం కోసం వేధిస్తున్నారని.. ఈ తరుణంలో ఆమెను చంపి ట్రాక్‌పై పడేసి ఉంటారని భావన తల్లిదండ్రులు ఆరోపించారు. అందుకే భర్త గజేంద్ర ఇంటి ముందే అంత్యక్రియలు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:'గోమూత్రం శానిటైజర్'.. ఇక కరోనాతో బేఫికర్!
Last Updated : Sep 17, 2020, 1:18 PM IST