అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో...హిందూ, ముస్లిం మత పెద్దలతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సమావేశం అయ్యారు. దిల్లీలోని ఆయన నివాసంలో స్వామి రామ్‌దేవ్, షియా క్లెరిక్‌మౌలనా కల్బే జావద్, స్వామి చిదానంద్‌సరస్వతి చర్చలు జరిపారు. దేశంలో శాంతి భద్రత, మత సామరస్యాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఇరు పక్షాల పెద్దలు ప్రకటించారు. దేశ ఐకమత్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కల్గించబోమని వారు తెలిపారు. శాంతి స్థాపన విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు.
అయోధ్య తీర్పు తర్వాత మతపెద్దలతో డోభాల్ భేటీ - Security Advisor Doval
హిందూ, ముస్లిం మత పెద్దలతో తన నివాసంలో భేటీ అయ్యారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. అయోధ్య తీర్పు తర్వాత దేశ ఐకమత్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కల్గించబోమని మతపెద్దలు తెలిపారు.
అయోధ్య తీర్పు తర్వాత మతపెద్దలతో డోభాల్ భేటీ