మార్చి 25న లాక్డౌన్ విధించే సమయానికి 3.4 రోజులుగా ఉండేది కరోనా కేసుల రెట్టింపు వ్యవధి. తాజాగా ఈ సమయం 17.4 రోజులకు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజుకు సగటున 10 వేల కేసులు నమోదవుతున్నా కరోనా కేసుల రెట్టింపు సమయం పెరగడం గమనార్హం.
అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య, పట్టణ కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ వీడియో సమావేశం నిర్వహించారు. కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువులైన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
కంటైన్మెంట్ జోన్లు, పరీక్షలు, ఆరోగ్య కేంద్రాల మౌలిక సదుపాయాలు సహా సిబ్బంది వినియోగంపై దృష్టి సారించాలని కేబినెట్ సెక్రటరీ రాష్ట్రాలకు సూచించారు.
మరిన్ని సూచనలు
⦁ కంటైన్మెంట్ జోన్లలో ప్రతి ఇంటిపై పర్యవేక్షణ ఉంచాలి.