ఉత్తర్ప్రదేశ్, నోయిడాకు చెందిన మాన్యా సింగ్, మానసి సింగ్ ఇద్దరు కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి అన్నింటిలో ఒకేలా కనిపించిన ఈ అమ్మాయిలు.. మార్కుల్లోనూ తాము కవలలమే అని నిరూపించుకున్నారు. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఇద్దరూ 95.8 శాతం మార్కులే సాధించారు. ఈ అంశాన్ని మొదటగా స్కూల్ యాజమాన్యం గుర్తించింది.
"మాకు ఐదు సబ్జెక్టుల్లో ఒకే విధమైన ఫలితాలు వచ్చాయి. ఇద్దరం 95.8 శాతం మార్కులతో 12వ తరగతిలో ఉత్తీర్ణులయ్యాం. పదో తరగతిలో ఇద్దరి మార్కుల్లో భేదం ఒక్క శాతమే. ఆ పరీక్షల్లో నాకు 97 శాతం, నా సోదరి మాన్యాకు 98 శాతం మార్కులు వచ్చాయి. మా సబ్జెకులు ఒకటే అయిన కారణంగా ఇద్దరం పక్కపక్కనే కూర్చుని చదువుకునే వెసులుబాటు ఉంటుంది."