కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇళ్లకే పరిమితమైన ప్రజలు అపురూపమైన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు విశేష ప్రేక్షకాదరణ పొందిన నాటి టీవీ సీరియల్స్‌ను మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఇటీవల రామాయణంతో పాటు మరికొన్ని ధారావాహికల ప్రసారాలను ప్రారంభించిన దూరదర్శన్ మరో కొన్ని సీరియల్స్‌ను ప్రసారం చేసేందుకు సిద్ధమైంది.
ప్రజల విజ్ఞప్తి మేరకు
హిందీలో ప్రసారమైనా హిందీయేతర రాష్ట్రాల్లోనూ ప్రజాభిమానం సొంతం చేసుకున్న టీవీ సీరియల్స్‌లో ముఖ్యమైనవి 'చాణక్య', 'శక్తిమాన్'. వీటిని మళ్లీ ప్రసారం చేయాలని నెటిజన్ల విజ్ఞప్తులతో ట్విట్టర్ హోరెత్తిపోతుంది. ప్రజల కోరిక మేరకు ఈ సీరియల్స్‌ను దూరదర్శన్(డీడీ నేషనల్) ప్రసారం చేయనుంది.
'చాణక్య'
విశేష ప్రజాదరణ పొందిన 'చాణక్య' సీరియల్ 47 ఎపిసోడ్లను ప్రసారం చేసేందుకు దూరదర్శన్ సిద్ధమైంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సీరియల్‌ను ప్రతి రోజు మధ్యాహ్నం ప్రసారం చేయాలని డీడీ భారతి నిర్ణయించింది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఈ ధారావాహిక మళ్లీ ప్రారంభం కానుంది.
'ఉపనిషత్ గంగా'
చిన్మయ మిషన్ ట్రస్ట్ నిర్మించిన 'ఉపనిషత్ గంగా' సీరియల్‌ను ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది డీడీ భారతి. 52 ఎపిసోడ్లు ఉన్న ఈ సీరియల్‌కు చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించారు.
'శక్తిమాన్'
ముకేశ్ ఖన్నా ప్రధానపాత్రలో నటించిన 'శక్తిమాన్' సీరియల్ అపురూపమైన ప్రజాదరణ సొంతం చేసుకుంది. ఈ ధారావాహికను ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంటకు.. గంట సేపు ప్రసారం చేసేందుకు డీడీ నేషనల్ నెట్వర్క్ సిద్ధమైంది.
'శ్రీమాన్.. శ్రీమతి'
ఆద్యంతం నవ్వులు చిందించే 'శ్రీమాన్.. శ్రీమతి' సీరియల్ ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు డీడీ నేషనల్లో ప్రసారమవుతుంది. మార్కంద్ అధికారి దీన్ని నిర్మించారు.
'కృష్ణ కాళీ'
18 ఎపిసోడ్లు ఉన్న 'కృష్ణ కాళీ' సీరియల్‌ను ప్రసారం చేసేందుకు డీడీ నేషనల్ సిద్ధమైంది. ప్రతి రోజు రాత్రి 8:30కు ఇది ప్రసారం కానుంది.
ఇప్పటికే ప్రారంభమైనవి..
ప్రజల విజ్ఞప్తి మేరకు ఇప్పటికే పలు సీరియల్ ప్రసారాలను ప్రారంభించింది డీడీ. వాటిలో ముఖ్యమైనవి..