తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మీ మొబైల్​​లో నెట్​వర్క్​ లేదా..? అయితే ఇలా చేయండి

నెట్‌వర్క్‌ విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులభంగా ఫిర్యాదు చేయడానికి ఓ మార్గం ఉందని మీకు తెలుసా..? అదే ట్రాయ్ (టెలిఫోన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) వెబ్‌సైట్‌. ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీరు మీ నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌పై ఫిర్యాదులు చేయవచ్చు. అదెలాగో తెలుసుకోండి మరి..!

Don't you have Network in mobile? Follow these steps to complain TROI
మీ మొబైల్​​లో నెట్​వర్క్​ లేదా..? అయితే ఇలా చేయండి

By

Published : Mar 10, 2020, 7:20 AM IST

అత్యవసర సమయాల్లో ఎవరికైనా ఫోన్‌ చేయాలనుకున్నప్పుడు ఫోన్‌ కలవకపోయినా.. ఒకవేళ కలిసినా వాయిస్‌ సరిగా వినిపించకపోయినా.. ఇంటర్‌నెట్‌ ఇబ్బంది పెట్టినా.. మనకు చిర్రెత్తుకొస్తుంది. వెంటనే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి ఎడాపెడా కడిగేయాలని అనుకుంటాం. ఇలాంటి సమస్యలు ఫోన్‌ వాడేవారిలో చాలా మందికి ఎదురవుతుంటాయి. కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే గంటల తరబడి లైన్‌లో ఉంచి ఇంకా విసుగుతెప్పిస్తారు. ఈ కారణంతో చాలా మంది కస్టమర్‌కేర్‌కు కూడా ఫోన్‌ చేయరు. ఎలాగోలా నడిపించేస్తుంటారు. అయితే, నెట్‌వర్క్‌ విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులభంగా ఫిర్యాదు చేయడానికి ఓ మార్గం ఉందని మీకు తెలుసా..? అదే ట్రాయ్ (టెలిఫోన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) వెబ్‌సైట్‌. ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీరు మీ నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌పై ఫిర్యాదులు చేయవచ్చు.

ఇలా చేయండి

ట్రాయ్ వెబ్‌సైట్‌

ముందుగా ట్రాయ్‌కు చెందిన టెలికాం వినియోగదారుల ఫిర్యాదుల పర్యవేక్షణ వ్యవస్థ (టీసీసీఎంసీ) అధికారిక వెబ్‌సైట్‌ www.tccms.gov.in లోకి ప్రవేశించాలి. సర్వీస్‌ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ రాష్ట్రం, జిల్లా తదితర విషయాలు నమోదు చేయాలి. ఒకసారి వివరాలు ఎంపిక చేసిన తర్వాత కస్టమర్‌ కేర్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ తదితర వివరాలతో ఓ కొత్త బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో సంబంధిత అంశంపై సరైన వివరాలతో సర్వీస్‌ ప్రొవైడర్‌పై ఫిర్యాదు నోట్‌ చేయాలి. అప్పుడు మీ సర్వీస్‌ ప్రొవైడర్‌కు సంబంధించిన ఫిర్యాదుల విభాగం తాలూక వివరాలు చూపిస్తుంది. అప్పటికీ సమస్యకు పరిష్కారం దొరక్కపోతే నేరుగా అప్పీలేట్‌ అథారిటీని సంప్రదించొచ్చు. ఫిర్యాదు చేసిన ఐడీ నోట్‌ చేసుకోవాలి. మీ సమస్యను మూడు నుంచి ఏడు రోజుల్లోపు పరిష్కరిస్తారు.

ఇదీ చూడండి : భారత్​లో 45కు పెరిగిన కరోనా కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details