రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై అధికార, ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. తాజాగా రఫేల్ ఒప్పందంపై మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం తీర్పు ఇవ్వడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. మరోసారి మోదీపై విరుచుకుపడింది. రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని, చౌకీదార్ దొంగతనానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు భావిస్తున్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు.
మోదీకి ఇష్టమున్నా లేకున్నా రఫేల్‌పై దర్యాప్తు జరుగుతుందన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.
" మోదీజీ... మీరు ఎన్ని అబద్ధాలు చెబుతారో, ఎంత దూరం పరిగెడతారో పరిగెత్తండి. కానీ, త్వరలోనే నిజాలు బయటపడతాయి. రఫేల్ కుంభకోణంలోని అక్రమార్కులందరూ ఒక్కొక్కరుగా బయటికొస్తారు. మోదీ ప్రభుత్వాన్ని దాచేందుకు అధికారికంగా రహస్యాల చట్టమేమీ లేదు.
రఫేల్ అవినీతిని వెలికితీస్తున్న జర్నలిస్టులను 'అధికారిక రహస్య చట్టం'తో మోదీ భయపెట్టారు. మోదీజీ... మీరేం చింతించకండి, మీకు ఇష్టమున్నా లేకపోయినా దర్యాప్తు జరుగుతుంది."
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి