కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బిహార్ రైతుల ఆదాయంతో దేశంలోని అన్నదాతల ఆదాయాన్ని సమానం చేయాలని మోదీ సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో పంజాబ్ రైతులు అత్యధిక ఆదాయం పొందుతుండగా.. బిహార్ రైతులు అత్యల్ప ఆదాయం సంపాదిస్తున్నారన్న ఓ మీడియా నివేదికను రాహుల్ ఉటంకించారు.
"దేశంలోని రైతులందరూ పంజాబ్ రైతుల ఆదాయంతో సమానమైన సంపదను పొందాలని భావిస్తున్నారు. అయితే మోదీ ప్రభుత్వం అందుకు భిన్నంగా రైతుల ఆదాయాన్ని బిహార్ రైతుల ఆదాయంతో సమానం చేయలని చూస్తోంది" అని హిందీలో ట్వీట్ చేశారు రాహుల్.
'దేశంలో రైతుల సగటు వార్షిక ఆదాయం రూ.77,124. పంజాబ్ రైతులు వార్షిక ఆదాయం రూ.2,16,708(అత్యధికం). బిహార్ రైతుల సంపాదన రూ.42,684 మాత్రమే'నన్న ఓ సర్వేను ప్రస్తావించారు రాహుల్.