తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల లెక్కలేవి" - advertising

రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల్లో చేపట్టే ప్రచారం, చెల్లింపు ప్రకటనల సమస్యను తేలిగ్గా తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని బాంబే హైకోర్టు హెచ్చరించింది.

By

Published : Feb 1, 2019, 7:56 AM IST

సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీలు చేపట్టే ప్రచారం, చెల్లింపు ప్రకటనలను తేలిగ్గా తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని బాంబే హైకోర్టు హెచ్చరించింది . న్యాయవాది సాగర్​ సూర్యవంశీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టు విచారణ చేపట్టింది .

WWW

ఎన్నికల సంఘంపై ఆగ్రహం

ఎన్నికల సంఘంపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, ప్రకటనల సమస్యపై కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అధికారిని పంపకపోవటాన్ని తప్పుపట్టింది. ఇది చాలా ముఖ్యమైన విషయమని, తదుపరి విచారణలో అధికారి హాజరుకాకపోతే వారెంట్​ జారీ చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ నరేశ్​ పాటిల్​, జస్టిస్​ ఎన్​ఎమ్​ జాందార్​లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అధికారిని పంపించకపోవడానికి గల కారణాలను తెలపాలని ఆదేశించింది.

ఫిబ్రవరి 4న వారి స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘం, సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​కు ఆదేశాలు జారీ చేసింది కోర్టు.

ఎన్నికలకు 48 గంటల ముందు నిషేధానికి డిమాండ్​

ఎన్నికలకు 48 గంటల ముందు నుంచి సామాజిక మాధ్యమాల్లో రాజకీయ, ఎన్నికల సంబంధిత ప్రకటనలు ఎవ్వరూ పోస్ట్​ చేయకుండా చూడాలని పిటిషనర్​ డిమాండ్​ చేశారు. ఇలాంటి పోస్టులను ఏ విధంగా అడ్డుకుంటారో తెలపాలని ఎన్నికల సంఘం, ఫేస్​బుక్​ సంస్థను ఆదేశించింది కోర్టు.

ABOUT THE AUTHOR

...view details