పనామా పత్రాల్లో బయటపడ్డ పన్ను ఎగవేతదారుల పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దాచి ఉంచడాన్ని సమర్థించింది కేంద్ర సమాచార కమిషన్. పేర్లు ఉన్న వారి వివరాలు, ఈ కేసులో తీసుకున్న చర్యలు, విచారణ జాప్యానికి కారణమైన అధికారుల పేర్ల కోసం..... సమాచార హక్కు చట్టం కింద దుర్గా ప్రసాద్ చౌదరి అనే వ్యక్తి ఈడీకి ఫిర్యాదు చేశారు. భద్రతా కారణాలతో ఈడీ ఆ విజ్ఞప్తిని తిరస్కరించగా ఆయన కేంద్ర సమాచార కమిషన్ ను ఆశ్రయించారు.
'పన్ను ఎగవేతదారుల పేర్లు దాయడం సబబే'
పనామా పత్రాల్లో బయటపడ్డ పన్ను ఎగవేతదారుల పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది కేంద్ర సమాచార కమిషన్. సమాచార హక్కు చట్టం కింద కేసు వివరాలు ఇవ్వటం లేదంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై కమిషన్ ఈమేరకు స్పందించింది.
పన్ను ఎగవేతదారుల పేర్లు బయటపెట్టవద్దు: కేంద్ర సమాచార కమిషన్
ఉన్నత స్థాయిలో అవినీతి జరిగి కేసు తీవ్రంగా ఉన్నా, తనకు పేర్లు ఇవ్వలేదని విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుడు వివరించారు. ఈడీ కూడా గట్టిగానే వివరణ ఇచ్చింది. నిఘా, భద్రతా సమాచారాన్ని ఆర్టీఐ కింద ఇవ్వరాదని చట్టంలో ఉందని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు ఆలకించిన సమాచార కమిషన్ ఎగవేతదారుల పేర్లు బయటపెట్టాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
ఇదీ చూడండి:దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే అదిరిపోయే స్టెప్పులు..!