తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తప్పుడు ఎగ్జిట్​పోల్స్​తో కుంగిపోవద్దు: కార్యకర్తలతో రాహుల్ - కాంగ్రెస్

తప్పుడు ఎగ్జిట్​పోల్స్​తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.  కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారాయన. నిరాశ, నిస్పృహలకు లోనవకుండా పార్టీపై విశ్వాసం ఉంచి అప్రమత్తంగా ఉండాలని ట్వీట్​ చేశారు.

తప్పుడు ఎగ్జిట్​పోల్స్​తో కుంగిపోవద్దు

By

Published : May 22, 2019, 5:27 PM IST

Updated : May 22, 2019, 8:08 PM IST

కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ సందేశం

ఎగ్జిట్​పోల్స్​ ఫలితాలను చూసి కార్యకర్తలు నిరాశ చెందవద్దని సందేశమిచ్చారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. పార్టీపై నమ్మకంతో అప్రమత్తంగా ఉండాలని ట్విట్టర్​ వేదికగా పిలుపునిచ్చారు.

"వచ్చే 24 గంటలు చాలా కీలకం. చురుగ్గా, అప్రమత్తంగా ఉండాలి. భయపడొద్దు. మీరు నిజం కోసం పోరాడుతున్నారు. తప్పుడు ఎగ్జిట్​ పోల్స్ ప్రచారం చూసి నిరుత్సాహపడొద్దు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. కాంగ్రెస్​పై నమ్మకం ఉంచండి. మీ శ్రమ వృధా కాదు. జైహింద్​."
-రాహుల్​ ట్వీట్​

ఈవీఎంలు ట్యాంపరింగ్​లకు గురయ్యాయనే ఆరోపణలతో కౌంటింగ్ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ప్రతిపక్షాలు ఇప్పటికే కోరగా... రాహుల్ తాజాగా ట్విట్టర్​లో ఈ సందేశమిచ్చారు.

ఇదీ చూడండి: ఈవీఎంల తర్వాతే స్లిప్పుల లెక్క: ఈసీ

Last Updated : May 22, 2019, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details