తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా నేతలను ప్రశ్నిస్తే అంతే: రాహుల్​ - రాహుల్

ఉన్నావ్​ అత్యాచార ఘటన బాధితురాలు సహా ఆమె కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురికావటంపై రాహుల్ గాంధీ  తీవ్రంగా స్పందించారు. భాజపా నేతలు తప్పు చేస్తే ఎదురు ప్రశ్నించకూడదంటూ విమర్శించారు. మోదీ 'బేటీ పడావో బేటీ బచావో' కార్యక్రమం ఇందుకేనా అని ప్రశ్నించారు.

రాహుల్​

By

Published : Jul 29, 2019, 6:49 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​ అత్యాచార ఘటన బాధితురాలు సహా ఆమె కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. బంధువులు, ఆమె తరఫు న్యాయవాదితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా రాయ్​బరేలిలో ఓ లారీ​ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించారు. న్యాయవాదికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంపై ఓ మీడియా కథనాన్ని ఉటంకిస్తూ భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.

రాహుల్ ట్వీట్​

"బేటీ బచావో-బేటీ పడావో. భారత మహిళల విద్య కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం. కానీ మిమ్మల్ని అత్యాచారం చేసిన వ్యక్తి భాజపా ఎమ్మెల్యే అయితే ప్రశ్నించకూడదు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు

భాజపా ఎమ్మెల్యే కుల్​దీప్​ సెన్​గర్​ తనను 2017లో అత్యాచారం చేసినట్లు ఉన్నావ్​కు చెందిన ఓ మైనర్​ ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ నివాసంలో బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సీబీఐ దర్యాప్తునకు సిద్ధం: డీజీపీ

ప్రమాదంపై ఎమ్మెల్యే కుల్​దీప్​ సింగ్​, ఆయన తమ్ముడు మనోజ్​సింగ్​తో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేశారు రాయ్​బరేలి పోలీసులు. రోడ్డు ప్రమాదంపై సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్తర్​ప్రదేశ్​ డీజీపీ ఓపీ సింగ్​ స్పష్టం చేశారు.

"లారీ వేగంగా వస్తోంది. అదే సమయంలో వర్షం వస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం రోడ్డు ప్రమాదంగానే భావిస్తున్నాం. కానీ పూర్తి స్థాయి, పారదర్శక దర్యాప్తునకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది."

-ఓపీ సింగ్, యూపీ డీజీపీ

ఇదీ చూడండి: ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన- అరెస్టు

ABOUT THE AUTHOR

...view details