అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభానికి ముందే ఇప్పటివరకు రూ.41 కోట్ల విరాళాలు అందినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆధ్యాత్మికవేత్త మొరారీ బాబు రూ.11 కోట్లు విరాళం ఇచ్చినట్లు ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద దేవ్ గిరి తెలిపారు. అయితే భూమిపూజ జరిగిన బుధవారం రోజు.. ఇతరులు ఇచ్చిన విరాళాలు చూపించలేదన్నారు.
ఆ ప్రక్రియ పూర్తయితే..
పర్మార్థ్ నికేతన్‌కు చెందిన స్వామి చిదానంద సరస్వతి, జునా అఖాడకు చెందిన స్వామి అవదేషానంద్ గిరి, బాబా రాందేవ్ సహా అయోధ్యలో ఉన్న ఇతర ప్రముఖులు, మత పెద్దలు, పీఠాధిపతులు అందించిన విరాళాలు ఈ రూ. 41 కోట్లకు అదనం.
విదేశాల నుంచి కూడా విరాళాలు ఇచ్చేందుకు భక్తులు ముందుకువస్తున్నారని, కేంద్రం అనుమతి పొందిన తర్వాతే వాటిని తీసుకుంటామని స్పష్టం చేశారు కోశాధికారి.
ఇదీ చూడండి:'కరోనా రోగులపై పని చేయని ప్లాస్మా చికిత్స'