సచిన్, కోహ్లీ, బాలీవుడ్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు కరతాళధ్వనులు, అరుపులతో మోటేరా స్టేడియం హోరెత్తిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సినీ పరిశ్రమ బాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించారు. క్లాసిక్ చిత్రాలు దిల్వాలే 'దుల్హనియా లేజాయెంగే', 'షోలో' సినిమాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు.
భారత్‌లో విశేష ఆదరణ ఉన్న క్రికెట్ గురించి మాట్లాడారు ట్రంప్. ముఖ్యంగా సచిన్, కోహ్లీ గురించి, భారత పండుగలపై ట్రంప్ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
"సృజనాత్మక బాలీవుడ్ నుంచి ఏటా 2 వేల చిత్రాలు నిర్మితమవుతున్నాయి. ప్రపంచం మొత్తం బాంగ్రా నృత్యం, భారత క్లాసిక్ చిత్రాలు డీడీఎల్జే, షోలే చూసి ఎంతగానో ఆనందిస్తున్నారు.
ఈ దేశంలో ప్రపంచ దిగ్గజ క్రికెటర్లైన సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీని ఎంతగానో అభిమానిస్తారు.
భారతదేశ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటారు. సర్వమానవ సౌభ్రాతృత్వానికి ప్రతీకగా హోలీ జరుపుకుంటారు." - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు