కేరళలోని కరునాగపల్లికి చెందిన స్విమ్మర్ రతీశ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. కాళ్లు, చేతులు బంధించి ఉండగా.. పది కిలోమీటర్లు దూరాన్ని నీళ్లలో ఈది, గిన్నిస్ రికార్డు సంపాదించాడు. ఆటుపోటులు మధ్య, నీటి అలలకు ఎదురీదుతూ ఐదు గంటల్లో ఈ సాహసం పూర్తి చేశాడు 'డాల్ఫిన్' రతీశ్. కేరళలోని టీఎస్ కాలువ ఇందుకు వేదికైంది.
ఇలా సాగింది...
చేతుల మధ్య 20 సెంటిమీటర్ల దూరం మాత్రమే ఉండేలా బేడీలను ధరించాడు రతీశ్. 30 సెంటిమీటర్ల దూరం మాత్రమే ఉండేలా కాళ్లను తాడుతో కట్టుకున్నాడు.
ఒడ్డున నిలుచున్న స్థానికులు.. ఈలలు, చప్పట్లతో ప్రోత్సాహించగా.. రతీశ్ ఈత కొనసాగింది. తొమ్మిది కిలోమీటర్ల దూరాన్ని అతడు నాలుగు గంటల్లో ఈదగా.. చివరి కిలోమీటర్ దూరాన్ని ఛేదించడానికి గంటన్నరకు పైగానే సమయం పట్టింది. అజీక్కల్ వంతెన వద్దకు చేరుకోగా.. రికార్డు పూర్తైంది. నీటిలో సుడిగుండాలు, ఆటుపోటులు ఎదురైనప్పటికీ.. దిగ్విజయంగా రతీశ్ బుధవారం ఈ సాహసాన్ని పూర్తి చేశాడు.