గుజరాత్ జానపద గాయకుడు కీర్తి ధన్ గఢ్వీపై డాలర్లు, పౌండ్ల వర్షం కురిపించారు లండన్లో నివసిస్తోన్న గుజరాతీలు. అందరూ కలిసి సరదాగా లండన్లో ఏర్పాటు చేసుకున్న జానపద పాటల కార్యక్రమంలో ఈ దృశ్యం కనిపించింది.
కథియావాడి జానపద పాటలతో పాటు సూఫీ, హిందీ పాటలను గానం చేస్తూ శ్రోతలను ఉర్రూతలూగించారు గాయకులు. ప్రముఖ గుజరాతీ గాయకులు మాయాభాయ్ అహిర్, గీతా రబారీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.