కాసింత ప్రేమ పంచితేనే ఆజన్మాంతం రుణపడిపోతాయి శునాకాలు. యజమానికి విపరీతమైన విశ్వాసాన్ని పంచుతాయి. సరదాకి సున్నితంగా కసిరితేనే చిన్నబోయి ఓ మూల కూర్చుంటాయి. ఇక తననో బిడ్డలా చూసుకున్న యజమాని దూరమైతే..? ఆ వేదన పెంపుడు కుక్కలు భరించగలవా..? నోరు లేని జీవులు తమ బాధను పంచుకోగలవా..? అంతటి శోకాన్ని భరించలేక కర్ణాటకలోని ఓ శునకం కన్నుమూసింది.
బెలగావి, మూడలగి తాలూకా అవరాది గ్రామానికి చెందిన శంకరప్ప మడివాలా ఓ శునకాన్ని పెంచుకన్నాడు. కడ్డీ అని పేరు పెట్టకుని కన్నబిడ్డలా చూసుకున్నాడు. సెప్టెంబర్ 6న(సోమవారం) హఠాత్తుగా శంకరప్ప మృతిచెందాడు. యజమాని మరణాన్ని దిగమింగలేకపోయింది కడ్డీ. తిండి తిప్పలు మానేసి, శంకరప్ప తిరిగే అన్ని చోట్ల వెతికింది. ఎంతకీ శంకరప్ప జాడలేకపోయేసరికి సెప్టెంబర్ 14న(సోమవారం) మహాలింగపురం గ్రామంలో తుదిశ్వాస విడిచింది కడ్డీ.