తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాను బలపరిచిన శునకం.. అరెస్టు

భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన ఓ శునకాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని నందూర్​బార్​ పట్టణంలో జరిగింది.

భాజపా ప్రచారకర్త కుక్క

By

Published : Apr 29, 2019, 7:00 PM IST

భాజపాకు అనుకూలంగా ప్రచారం చేస్తోందని ఓ శునకాన్ని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. నందూర్​బార్​ పట్టణంలో ఒంటిపై భాజపా స్టిక్కర్లతో వీధుల్లో తన యజమానితో కలిసి తిరుగుతోంది ఓ కుక్క. అయితే పోలింగ్​ జరుగుతున్న సమయంలో ప్రచారం నేరమని పోలీసులు ఆ శునకాన్ని అదుపులోకి తీసుకున్నారు.

నవనాథ్ ​నగర్​ ప్రాంత నివాసి ఏక్​నాథ్​ మోతిరాం చౌదరి... ఈ శునకం యజమాని. తన పెంపుడు కుక్క శరీరంపై "మోదీకి ఓటెయ్యండి.. దేశాన్ని కాపాడండి" అనే నినాదం ఉన్న స్టిక్కర్​ అంటించారు.

పోలింగ్​ సమయంలో ప్రచారాన్ని నేరంగా పరిగణించి యజమాని సహా కుక్కపైనా ఐపీసీ 171(ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. కుక్కను కస్టడీలోకి తీసుకోవాలని స్థానిక మునిసిపాలిటీని ఆదేశించారు.

ఇదీ చూడండి: గంభీర్​ ప్రచారాన్ని నిషేధించండి: ఆప్​

ABOUT THE AUTHOR

...view details